సోషల్ మీడియాకి దూరంగా ఉంటే వచ్చే కొన్ని లాభాలు.. మీకోసం

-

ప్రస్తుత సమాజంలో మనుషులకి దూరమవుతున్న వాళ్ళని చూస్తున్నాం కానీ, సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడో ఉన్న వాళ్ళని ఎలా ఉన్నారు అని ఫేస్ బుక్ లోనో, ఇన్స్టాలోనో పలకరిస్తాం. కానీ, పక్కింటి వారిని బాగున్నారా అని అడగము. మెషిన్లకి దగ్గరవుతూ ఎమోషన్లని కోల్పోతున్నాం. టెక్నాలజీ పెరిగాక ఎంత లాభం పెరిగిందో అంతే స్థాయిలో నష్టమూ ఉంది. మనుషులు జీవించడం మిస్సవుతున్నారు. కేవలం బ్రతికేస్తున్నారు.

మీ జీవితాన్ని అందంగా మార్చుకోవాలంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. అలా ఉంతే వచ్చే కొన్ని లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పని ఎక్కువ చేస్తారు. త్వరగా చేస్తారు

సోషల్ మీడియాని పక్కన పెడితే మీరు చేస్తున్న పనిలో వేగం పెరుగుతుంది. అంతే కాదు త్వరగా పూర్తవుతుంది కూడా. సోషల్ మీడియా వల్ల మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అందుకే మీరు చేసే పనిలో వంద శాతం మనసు పెట్టరు.

సృజనాత్మకత పెరుగుతుంది

ఎప్పుడూ ఎదుటివాళ్ళు చేసింది చూసే మీకు క్రియేటివిటీ తగ్గిపోతుంది. అందుకే మీలో క్రియేటివిటీ పెరగాలంటే మీ లోపలి నుండి భావాలు రావాలి. దాని కోసం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. అనవసరమైన ఆలోచనలు రావు కాబట్టి, మీ మెదడు సృజనాత్మకంగా పని చేయడం ప్రారంభ్హిస్తుంది.

ఒత్తిడి తగ్గుతుంది

కొన్ని సార్లు మనకి సంబంధం లేకపోయినా కొన్ని వార్తలు ఇబ్బంది కరంగా ఉంటాయి. అవి ఒత్తిడికి గురి చేయవచ్చు కూడా. ఆ ఒత్తిడి నుండి తప్పించుకోవాలంటే సోషల్ మీడియాని పక్కన పెట్టండి.

ఆరోగ్యకరమైన నిద్ర పడుతుంది

తరచుగా ఫోన్ వాడకపోవడం వల్ల అది మీపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ కళ్ళకి శ్రమ కలగదు కాబట్టి, నిద్ర కూడా బాగా పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news