మునగ టీ తో కలిగే లాభాలని చూస్తే.. ఈరోజు నుండే మొదలు పెట్టేస్తారు..!

-

మునగ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మునగ వలన కలిగే లాభాలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా రోజూ మునగ టీ ని తాగుతూ ఉంటారు దీని వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తే ఈ రోజే మొదలు పెట్టేస్తారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు ఆరోగ్యంగా ఉండాలని అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం సరైన జీవన విధానం అనుసరించడం వంటికి చేస్తున్నారు ఎక్కువ మంది ఈ రోజుల్లో బరువు ఎక్కువగా ఉంటున్నారు పైగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతోంది. ఈ సమస్యల నుండి బయట పడాలని అనుకుంటున్నారు.

మునగ టీ ని చేసుకొని తాగితే ఈ సమస్య నుండి బయటపడొచ్చు. మీ పొట్ట ఫ్లాట్ గా మారిపోతుంది. మునగని తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం కిడ్నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మునగ టీ ని ఎలా తయారు చేసుకోవాలి..? ఈ టీ ని తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాలను కూడా ఇప్పుడు చూసేద్దాం.

మునగ టీ కి కావాల్సిన పదార్థాలు:

ఒకటిన్నర కప్పు నీళ్లు
అర టీ స్పూన్ మునగపొడి
ఒక టీ స్పూన్ తేనె
ఒక టీ స్పూన్ నిమ్మరసం

దీనికోసం ముందు మీరు ఒక పాన్ పెట్టుకుని అందులో ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకుని అర టీ స్పూన్ మునగ పొడిని వేసుకుని మరిగించుకోండి. సగం అయ్యే వరకు కూడా స్టవ్ మీద ఉంచండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోండి. ఈ టీ లో ఇప్పుడు తేనె నిమ్మరసం వేసుకుని తీసుకోండి. రోజూ మునగ టీ ని తీసుకోవడం వలన మీ పొట్ట ఫ్లాట్ గా మారిపోతుంది పొట్టు చుట్టూ ఉండే కొవ్వు పోతుంది ఇలా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news