మనకు బ్రొక్కొలి గురించి పెద్దగా తెలియదు కానీ..పూర్వం రోజుల్లనే ఇతర దేశాల్లో దీన్ని తినేవారు. మనకు లభించేది కాదు..కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బ్రొక్కొలి అందుబాటులో ఉంటుంది. క్యాబేజీల్లో రకాలు, క్యాప్సికమ్ లో కూడా కొన్ని రకాలు వస్తున్నాయి. అలాగే ఆకుల్లో మనకు తెలియని ఆకు ఒకటుంది..అదే కాలే.. ఈ ఆకులు కూడా క్యాబేజీ, బ్రక్కొలి టైప్ లో ఉంటాయి. పెద్ద పెద్ద ఫుడ్ స్టోర్స్ లో మనం ఇది చూసే ఉంటాం..కానీ మనకు అస్సలు తెలియనిది ఎందుకులే అని తెచ్చుకోం. ఈ కాలే ఆకును కూడా ఆకుకూరలా వండుకుని తొనొచ్చు. ఈ ఆకు వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి..ఇది అసలు వాడొచ్చా లేదా అనేది ఈరోజు చూద్దాం.
కాలే ఆకు 100 గ్రాములే 50రూపాయలు ఉంటుంది. పోషకాల విషయం చూస్తే..
శక్తి 50 కాలరీలు
కార్భొహైడ్రేట్స్ 10 గ్రాములు
ప్రొటీన్ 3.3 గ్రాముల
ఫ్యాట్ 0.7 గ్రాములు
ఫైబర్ 2 గ్రాములు
పొటాషియం 447 మిల్లీ గ్రాములు
సోడియం 43 మిల్లీగ్రాములు
కాల్షియం 135 మిల్లీగ్రాములు
విటమిన్ A 2870 మైక్రో గ్రాములు బిటీకెరోటిన్ ఉంది.
విటమిన్ C 94మిల్లీ గ్రాములు
విటమిన్ K 390 మిల్లీగ్రాములు
ఇవి 100 గ్రాముల కాలేలో లభించే స్థూల, సూక్ష్మపోషక విలువలు
అసలు ఇది తినటం వల్ల ఏం ఏం ప్రయోజనాలు వస్తాయి?
కాలే ఆకుని కొత్తిమీర వాడినట్లు వాడుకోవచ్చు, సలాడ్స్ లో వాడుకోవచ్చు, జ్యూసుల్లో వాడుకోవచ్చు, ఆకుకూరలా వండుకుని అయినా తినొచ్చు. శాండివిచ్ లో పెట్టుకోవచ్చు.
ఇందులో ఉన్న ఆరోగ్య లాభాలు గురించి 2006వ సంవత్సరంలో యూనివర్శిటి ఆఫ్ న్యూ మెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్( University Of New Mexico School Of Medicine) అమెరికా వారు పరిశోధన చేసి ఏం చెప్పారంటే..
ఇందులో ముఖ్యంగా 159 మిల్లీగ్రాముల యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయట. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మన కణజాలంలో ఉండే డీఎన్ఏ డామేజ్ కాకుండా రక్షించి, క్యాన్సర్ రాకుండా నిర్మూలించడానికి ఇది బాగా పనికొస్తుంది.
ఆటో ఇమ్యూన్ డిజాడర్స్..అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మనల్ని రక్షించటానికి బదులు..మన శరీర అవయువాల మీద దాడి చేసి..దీర్ఘరోగాలకు దారితీస్తుంది. అలా రాకుండా రక్షించడానికి ఈ ఆకులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ బాగా హెల్ప్ చేస్తున్నాయని వాళ్లు ఇవ్వటం జరిగింది.
ఈ ఆకులో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉన్నందువల్ల కంటిచూపును మెరుగు చేయడానికి, రక్తం ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుందట
ఎముకలు గుల్లబారకుండా కూడా ఈ ఆకు బ్రహ్మండగా రక్షిస్తుందట. విటమిన్ కే ఎక్కువ డోస్ లో ఉండటం వల్ల బోన్ హెల్త్ కు చాలా మంచిది.
ఈ ఆకులో బైల్ యాసిడ్ సీక్వెన్ ట్రెంట్స్( Bile acid sequestrants) అనే కెమికల్ ఉండటం వల్ల కొవ్వులను ప్రేగుల నుంచి రక్తంలోకి, లివర్ లోకి వెళ్లకుండా నిర్మూలించడానికి, పేగుల్లోంచి తొలగించడానికి ఈ కెమికల్ బాగా ఉపయోగపడుతుంది. తద్వారా ఒబిసిటీ, ఫ్యాటిలివర్, హార్ట్ ఇష్యూస్ రాకుండా రక్షిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
కాస్ట్ కు తగ్గట్టుగానే ఫలితాలు ఉన్నాయి కాబట్టి..డబ్బులకు ఇబ్బందిలేని వాళ్లు..స్టోర్స్ లో లభించినప్పుడు తెచ్చుకుని పైన చెప్పినట్లు వాడుకుంటే చాలా మంచిదంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu