బెంగాల్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత ముజుందార్ డిమాండ్ చేశారు. వచ్చే 15 రోజుల్లో ఇంధన ధరలపై పన్నులు ఎత్తివేయాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని సుకాంత మజుందార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీఎస్టీ బకాయిలను కేంద్రం క్లియర్ చేసిన నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు సుకాంత మజుందార్. పెట్రోలుపై కనీసం రూ. 5, డీజిల్‌పై 10 తగ్గించాలని సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్నులు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కూడా ఆ పని చేయలేదని దుమ్మెత్తి పోశారు సుకాంత మజుందార్. ఈ విషయంలో 15 రోజులు మాత్రమే వేచి చూస్తామని, అప్పటికీ ఇంధన ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే తాము వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని సుకాంత మజుందార్ వెల్లడించారు. అంతేకాకుండా సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని మజుందార్ హెచ్చరించారు.