ఏపీలో ముందు బిజెపి ఆ పని చేస్తే బెటర్

-

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి సమర్ధ నాయకత్వం కొరత అనేది ఉంది. సమర్ధ నాయకత్వాన్ని నిర్మించుకునే విషయంలో ఆ పార్టీ ముందు నుంచి కూడా చాలా వరకు అలసత్వంగానే ఉంది. సొంతంగా నాయకులను తయారు చేసుకునే సామర్ధ్యం కూడా ఆ పార్టీకి లేదు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో సుస్థిర స్థానం కావాలని భావిస్తున్న అధిష్టానం తెలుగుదేశం పార్టీ నేతల మీదనో లేక వైసీపీ నేతల మీదనో ఎక్కువగా ఆధారపడుతుంది. పార్టీ బలోపేతం విషయంలో పార్టీ అధిష్టానం ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు.

జాతీయ స్థాయి పరిస్థితులు వేరు దక్షిణాది పరిస్థితులు వేరు. దక్షిణాదిలో పార్టీని ముందుకు నడిపించే నేతలు ఆ పార్టీకి చాలా తక్కువ. తెలంగాణాలో ఇద్దరు నేతలు సమర్ధంగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అక్కడ చాలా బలంగా ఉన్నారు. వారు పార్టీకి తమ వంతుగా సహాయ సహకారాలు అందించి తమను ఎంపీలు చేసిన పార్టీ ఋణం తీర్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కాని ఏపీలో ఆ వాతావరణం లేదు అనే చెప్పాలి.

ఇప్పుడు ఏపీలో బిజెపికి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వారిలో ఒక్కరు అంటే ఒక్కరికి కూడా ప్రజాదరణ అనేది లేదు. సుజనా చౌదరి, సిఎం రమేష్ ఆర్ధికంగా బలమైన నేతలు కాబట్టే నాడు చంద్రబాబు నాయుడు రాజ్యసభకు పంపించారు. బీసీ నేత కాబట్టి టీజీ వెంకటేష్ ని రాజ్యసభకు పంపించారు. టీజీ వెంకటేష్ కి అయినా కాస్త బలం ఉంది గాని సుజనా, సిఎం రమేష్ లకు లేదు. ఇప్పుడు వారు మినహా పార్టీలో ఎవరూ కనపడటం లేదు. సోము వీర్రాజు బలమైన నేత కాదు. ఆయన కంటే కన్నా కాస్త మెరుగు.

గతంలో ఎన్నో ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేయడం, గుంటూరు జిల్లాలో ఆయనకు అంటూ ఒక వర్గం ఉండటం జరిగాయి. కాని సోము వీర్రాజుకి ఆ పరిస్థితి లేదు. విష్ణు కుమార్ రాజు వంటి వారు ఉన్నా సరే టీడీపీతో స్నేహం అని చెప్పి వారిని పక్కన పెట్టారు. కామినేని శ్రీనివాస్ ది కూడా అదే పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి వంటి వారు ఉన్నా… వారు అంత స్వేచ్చగా పని చేసే పరిస్థితి లేదు అనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు బిజెపి సమర్ధ నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news