పిల్లలకూ చుక్కల మందు టీకా.. డీసీజీఐ అనుమతి కోరిన భారత్‌ బయోటెక్‌

-

5-18 ఏళ్ల వయసు వారికి ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (ఇంట్రానాసల్‌) కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డీసీజీఐని భారత్ బయోటెక్ అనుమతి కోరింది. 5-18 ఏళ్ల వారికి మూడో దశ పరీక్షల్లో ఆయా వయసుల వారికి ఇది అందించే భద్రత, రోగనిరోధక శక్తి తదితరాలపై మదింపు జరుపుతారు. కొవాగ్జిన్‌తో బీబీవీ154 రోగ నిరోధక శక్తి, భద్రతను పోల్చి చూసేందుకు మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. దేశంలో 9 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతించారు.

18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చింది. దేశంలో ముక్కు ద్వారా అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్​ వ్యాక్సిన్​ ఇదే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. కొవిడ్‌పై పోరులో నాసల్​ వ్యాక్సిన్​ ఒక బిగ్‌ బూస్ట్‌ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news