మెగాస్టార్ చిరు సినిమాలో విక్టరీ వెంకటేష్ !

-

ఆచార్య సినిమా తర్వాత మెగా స్టార్‌ చిరంజీవి.. తన ఫ్యాన్స్‌ కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి… మూడు సినిమాలను లైన్‌ లో పెట్టారు. అందులో ఒకటే మెగాస్టార్ 154 సినిమా. ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ పెట్టనున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ తో పాటు.. విక్టరీ వెంకటేష్‌ కూడా నటిస్తున్నారట. ఈ సినిమాలో గెస్ట్‌ పాత్రలో వెంకీ కనిపించనున్నారని టాక్‌. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news