Acharya: ‘భవదీయుడు భగత్ సింగ్’ లీక్..మెగాస్టార్ నోట పవన్ కల్యాణ్ మూవీ డైలాగ్

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా హరీశ్ శంకర్ ‘ఆచార్య’ టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. మెగా స్టార్ చిరు, రామ్ చరణ్, కొరటాల శివలను ఈ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు అడగగా వాటికి ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ డైలాగ్ మొన్న చెప్పావ్ కదా..అది చెప్పు.. లీక్స్ ఇచ్చేయాలని మెగాస్టార్ చిరంజీవి సరదాగా అడిగారు. దాంతో హరీశ్ శంకర్ డైలాగ్ చెప్పేశాడు. ‘హీరో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన వెనుక చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. ఏంటి ఈడి ధైర్యం అంటే.. నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు..బహుశా ఇదే అతడి ధైర్యం. అని ఒకరు చెప్తారు. అప్పుడు పక్కనున్న వాడు.. లేదు సార్ లక్ష మందికి ఆయన ముందు నడుస్తున్నాడని ధైర్యం’ అని చెప్పాడు. అలా ‘భవదీయుడు భగత్ సింగ్’ డైలాగ్ లీక్ చేశారు.

ఇవే మాటలను మెగాస్టార్ తన నోట చెప్పాడు. ‘ఏంటండి.. వీడి ధైర్యం.. పవన్ కల్యాణ్.. ధైర్యం. తాను రోడ్డెక్కితే.. వెనుక లక్ష మంది వస్తారని కాదు..లక్ష మందికి ఆయన ముందు నడుస్తు్న్నాడని ధైర్యం’ అనే మాటలను చిరంజీవి చెప్పారు. ఈ డైలాగ్ చాలా బాగా రాశారని కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మెచ్చుకున్నారు.

ఇక తను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తానని, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా తర్వాత వస్తానని చెప్పుకొచ్చారు హరీశ్ శంకర్. అందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పారు. అయితే, తనలోని హాస్య గ్రంథులను మేల్కొలిపే విధంగా సినిమా ఉండాలని సూచించారు. ‘దొంగ మొగుడు, రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలు తాను చిరంజీవితో తీస్తానని గతంలో హరీశ్ శంకర్ చాలా సార్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news