తెలంగాణ : SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్…

-

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఒక అలెర్ట్ ను ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం కొందరు అభ్యర్థులు నోటిఫికేషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అప్ప్లై చేసుకున్నట్లు తెలిసిందట. అంటే ఈ ఉద్యోగాలకు తగిన వయసు మరియు విద్యార్హత లేకపోయినప్పటికీ అప్ప్లై చేసుకున్నారని పోలీస్ నియామక మండలి ధ్రువపరిచింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ నియామక మండలి వారు సర్టిఫికెట్ లను చాలా జాగ్రత్తగా పరిశీలించి వయసు మరియు విద్యార్హత లో ఏమైనా తేడాలు ఉంటే, వెంటనే వారిని పక్కన పెట్టేస్తున్నామని తెలిపింది. ఈ సందర్భంగా ఈ మండలి తెలుపుతూ.. ఈ పోలీస్ నియామకాలు చాలా పారదర్శకంగా జరుపుతున్నామని… ఎటువంటి అక్రమాల గురించి అయినా మీకు తెలిసినా లేదా మీ దృష్టికి వచ్చినా మాకు తెలియచేస్తే వారికీ రూ. 3 లక్షల బహుమతిగా ఇస్తామని తెలిపింది.

ఇందుకు సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు … 9393711110 OR 9391005006

Read more RELATED
Recommended to you

Latest news