ఎమ్మెల్యే సీతక్క: అధికారం శాశ్వతం కాదు.. విలువలతో కూడిన వ్యక్తిత్వమే శాశ్వతం

-

రేపు తెలంగాణలోని ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగనుంది, ఈ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షములో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు. అయితే ఈ సభను ఎలాగైనా పరేషాన్ చేయడానికి BRS ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ అధికార పార్టీ రేపు జరగనున్న సభకు ప్రజలను రాకుండా ఆదుకోవడానికి కుట్రలు పన్నుతోందన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా మీటింగ్ అయ్యాక అందరం కూర్చుని పరిష్కరించుకుందాం… మీటింగ్ కు రాకుండా ఎవ్వరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజల గర్జన సభకు రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చింది సీతక్క. ఇంకా ఈమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇవ్వకుంటే నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడివా అంటూ పువ్వాడ అజయ్ పై విమర్శలు చేసింది.

ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు.. విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని శాశ్వతం అంటూ తన గొంతు వినిపించింది సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news