జగన్ కు బిగ్ షాక్..ఇచ్చిన రూ.1000 కోట్లను వెనక్కి తీసుకున్న కేంద్రం !

-

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏపీకివ్వాల్సిన నిధులను ఇచ్చినట్టే ఇచ్చి మినహాయించేసుకుంది కేంద్రం. ఏపీకి ఇచ్చిన సుమారు రూ. 1000 కోట్ల నిధులని వెనక్కు తీసేసుకుంది కేంద్ర ఆర్థిక శాఖ.

జీఎస్టీ పరిహారంలో రాష్ట్రానికి రావాల్సిన రూ. 682 కోట్లను వెనక్కి తీసుకుంది కేంద్రం. మరో హెడ్ కింద ఏపీకి ఇచ్చిన సుమారు రూ. 300 కోట్ల మేర నిధులని మినహాయించుకుంది. ఈ నిధుల మినహాయింపుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక శాఖ. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులకూ ఇక్కట్లు పడుతోంది.

 

సెక్రటేరీయేట్టులోని ఐదు విభాగాల ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు పడలేదు. రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్లను పూర్తి స్థాయిలో బట్వాడా చేయలేదు సర్కార్. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news