Big Boss Non Stop: ‘బిగ్ బాస్’ టైటిల్ విన్నింగ్‌పై కంటెస్టెంట్స్ ఫోకస్..ఓటింగ్‌లో అతనే టాప్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ కొనసాగుతోంది. ఎనిమిదో వారం కొనసాగుతున్న గేమ్ లో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం అనగా ఏడో వారం హౌజ్ నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ప్లేస్ ను రిప్లే స్ చేశాడు బాబా మాస్టర్.

‘బిగ్ బాస్’ బాబా మస్టర్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటిలోకి పంపించారు. ఇక మంగళవారం ఇంటి సభ్యులో ఓటింగ్ విషయానికొస్తే..ఇంట్రెస్టింట్ థింగ్స్ జరిగాయి. ఓటింగ్ లో ఈ సారి అఖిల్ సార్థక్ సత్తా చాటాడు. 37.18 పర్సంటేజీ ఓట్లతో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్ లో అనిల్ రాథోడ్ 32.67 పర్సంటేజీతో ఉన్నాడు. ఇక ఆ తర్వాత స్థానాల్లో హమీద, అషురెడ్డి, అజయ్ ఉన్నారు. హమీదకు 16.17 పర్సంటేజీ ఓటింగ్, అషురెడ్డికి 8, అజయ్‌కు 5 పర్సంటేజీ ఓటింగ్ వచ్చాయి.

టాప్ పొజిషన్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ , బీబీ లవర్స్ ఓటింగ్ పర్సంటేజీని చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ టూ పొజిషన్స్ డైనమిక్ గా చేంజ్ అవుతున్నాయి. ఇకపోతే అజయ్ ను ఈ సారి సేవ్ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అందులో ఎంత వరకు నిజముందనేది తెలియలాంటే ఈ వారం ఎపిసోడ్స్ పూర్తయ్యే వరకు బీబీని చూడాల్సిందే.

నిజానికి ‘బిగ్ బాస్’ లో వీక్ కంటెస్టెంట్స్ గా అజయ్, అషురెడ్డి ఉన్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. అయితే, నెక్స్ట్ వీక్ వరకు పొజిషన్స్ చేంజ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే టాస్కుల పరంగా వీరి పర్ఫార్మెన్స్ మెరుగయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ప్రభావితం చేయనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news