రోజు రోజుకు నేరస్థుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమంగా డబ్బు, బంగారం మరియు ఇతర విలువైఎన్ వస్తువులను రవాణా చేయడానికి ఎన్నో మార్గాలను వీరు వెతుక్కుంటున్నారు. తాజాగా తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల నుండి వెలువడిన సమాచారం ప్రకారం పట్టుకున్న బంగారం దాదాపుగా 269 గ్రాములుగా తెలుస్తోంది, ఇక దీని విలువ రూ. 16.5 లక్షలుగా ఉంది.
ఈ బంగారాన్ని ఇద్దరు ప్రయాణికులు దుబాయ్ నుండి హైద్రాబాద్ కు తీసుకువచ్చే ప్రయత్నంలో కస్టమ్స్ చెకింగ్ లో దొరికిపోయారు, చాకోలెట్ ల మధ్యలో ఈ బంగారాన్ని ఉంచి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. వీరిని అక్కడికక్కడే కస్టమ్స్ ఆఫీసర్స్ అరెస్ట్ చేసి పూర్తి వివరాల కోసం విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఎప్పటికైనా గుర్తుంచుకోండి అక్రమంగా అధికారుల కళ్లుగప్పి దొంగతనాలు చేస్తే ఎప్పటికైనా పట్టుబడక తప్పదు.