తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. నేడు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ లో తెలంగాణ లో పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజులో 20 గంటలు తెలంగాణ లో లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
పది రోజుల పాటు తెలంగాణలో అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలతో పాటుగా ఇతర కొనుగోళ్ళకు కూడా అనుమతి ఉంటుంది అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. కార్యకలాపాలకు కేవలం నాలుగు గంటలు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని నిర్ణయించారు.