క్యాసినో కథలు..పెద్ద తలకాయలు బయటపడతాయా?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం మరోసారి సంచలనమైంది…గత జనవరి సంక్రాంతి సమయంలో గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పుడు మంత్రిగా ఉన్న కొడాలి నానిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు..కానీ తాను గుడివాడలో లేనని, ఎవరో క్యాసినో నడిపితే తనకు సంబంధం ఎలా ఉంటుందని కొడాలి ప్రశ్నించారు. అయితే ఏమైందో తెలియదు గాని ఈ అంశం కొద్దిరోజులకే ముగిసింది.

ఇదిలా ఉండగా తాజాగా క్యాసినో ఏజెంట్లు అయిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది…తాజాగా ప్రవీణ్ మీడియా ముందుకొచ్చి…ఈడీ కొన్ని ప్రశ్నలు వేసిందని వాటికి సమాధానం చెప్పానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్యాసినో వ్యవహారంలో పెద్ద తలకాయలు చాలామంది ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, అలాగే పలువురు ఎమ్మెల్యేలు…ప్రవీణ్ కస్టమర్ల లిస్ట్ లో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అలాగే సినీ నటులు, అధికారులు సైతం ఉన్నారని తెలుస్తోంది.

ఇక తాజాగా తెలంగాణకు చెందిన మంత్రి మల్లారెడ్డి పేరు ఉన్న స్టిక్కర్ తో ప్రవీణ్ కారు నడుపుతున్నారు. కానీ ఆ స్టిక్కర్ ఎప్పుడో మార్చిలోనిది అని, ఎప్పుడో పీకి పారేసి ఉంటామని, దాన్ని ఎవరో పెట్టుకుంటే తనకు సంబంధం ఏం ఉందని మల్లారెడ్డి అంటున్నారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో విదేశాలు, ఇతర ప్రాంతాల్లో క్యాసినో కోసం ప్రవీణ్ ఏర్పాట్లు చేస్తాడని, ఈడీ అధికారులు ఇప్పుడు కస్టమర్ల తీగ లాగుతున్నారు. దీంతో ఏ డొంక కదులుతుందో అని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది.

కానీ ప్రవీణ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మీడియాకు సమాధానాలు ఇచ్చారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు సంధానం చెప్పానని, మళ్ళీ సోమవారం విచారణకు పిలిచారని, గోవా, నేపాల్‌ లో క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించామని చెబుతున్నాడు. మొత్తానికి క్యాసినో వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..అలాగే ఇందులో రాజకీయ నేతల పేర్లు బయటపడతాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news