వైయస్ షర్మిల, విజయమ్మలకు కోర్టులో భారీ ఊరట

-

ప్రజాప్రతినిధుల కోర్టు లో వైయస్సార్టిపి అధినేత వైయస్ షర్మిల మరియు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ కు భారీ ఊరట లభించింది. హైదరాబాద్ వైయస్సార్ మరియు వైయస్ విజయమ్మ ల పై ఉన్న కేసును… తాజాగా ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది. 2012 సంవత్సరంలో అనుమతి లేకుండా పరకాలలో బహిరంగ సభ నిర్వహించారు వైయస్ షర్మిల బృందం. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల మరియు వైయస్ విజయమ్మ ల పై పరకాల లో కేసు నమోదు అయ్యింది.

వీరిద్దరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా సురేఖ మరియు కొండా మురళీ సహా ఏకంగా తొమ్మిది మందిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదైంది. ఎన్నికల కోడు ఉల్లంఘిస్తూ బహిరంగ సభ నిర్వహించారని వీరందరి పై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసును ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం విచారణ చేపట్టింది.

దీనిపై విచారణ జరిపి ప్రజా ప్రతినిధుల కోర్టు… వారిపై ఉన్న కేసును కొట్టి వేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో వైయస్ షర్మిల మరియు విజయమ్మ లకు భారీ ఊరట లభించింది. కాగా రాజన్న రాజ్యమే లక్ష్యంగా… తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల… వైయస్సార్టీపి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేసీఆర్ సర్కార్ ను గద్దె దించే లక్ష్యంగా వైయస్ షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news