ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు అనేక సంచలనాలకు వేదికగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఈ ప్రకటన తీవ్ర ఇబ్బందిగా మారింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఈ ప్రకటన పెడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చంద్రబాబు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు కూడా ఎం మాట్లాడాలో కూడా అర్ధం కాక ఇబ్బంది పడుతుంది. కొంత మంది నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు.
ఇక ఇప్పుడు చంద్రబాబుకి ఇది రాజకీయంగా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ దెబ్బకు నమ్మిన వాళ్ళే చంద్రబాబుని వదిలేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంధ్ర కు చెందిన బలమైన రాజకీయ కుటుంబం తెలుగుదేశం పార్టీని వదిలేసే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వాళ్ళు ఇప్పటికే చంద్రబాబుతో కూడా ఈ విషయాన్ని చర్చించారని అంటున్నారు. అలాగే రాయలసీమ లో కూడా తెలుగుదేశం నేతలు ఆత్మరక్షణ లో పడ్డారు. పరిటాల కుటుంబం కూడా పార్టీని వదిలేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాజధాని దెబ్బకు ఇప్పటికే తెలుగుదేశం అంతర్గతంగా మల్ల గుల్లాలు పడుతుంది. వచ్చే ఏడాది మొదట్లోనే రాజధాని దెబ్బకు ఉత్తరాంధ్రలో గంటా, రాయలసీమలో కేయీ కుటుంబాలు, తూర్పు గోదావరి నుంచి కొందరు నేతలు వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయని సమాచారం. చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలే దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఇప్పటికే పక్క చూపులు చూడటం మొదలుపెట్టారు. ఏది ఎలా ఉన్నా జగన్ దెబ్బ మాత్రం విపక్షానికి గట్టిగానే తగిలింది.