టమాట పులావ్ ను చూస్తే చాలు.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!

-

కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. పన్నీర్ కూడా వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్లు. డ్రై ఫ్రూట్స్ వేసుకునే వాళ్లు ఆయిల్ వేసినప్పుడే ఆయిల్ లో వేసి దోరగా వేయించుకుంటే బాగుంటుంది. పన్నీర్ వేసుకోవానుకున్న వాళ్లు పన్నీరును చిన్నచిన్న ముక్కలుగా కోసి ఆయిల్ లో ఉల్లిగడ్డు, పచ్చి మిర్చి వేసిన తర్వాత వేసి వేయించుకోండి.

టమాట పులావ్.. లేదా టమాట రైస్.. దాన్ని చూస్తేనే నోరూరుతుంది. వేడి వేడిగా టమాట పులావ్ ను చకచకా లాగించేస్తే ఉంటుంది.. ఆ మజాయే వేరు. మరి.. నోరూరించే టమాట పులావ్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

tomato pulao preparation

టమాట పులావ్ ను మామూలు సన్న బియ్యంతో చేసుకోవచ్చు. లేదంటే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఏ బియ్యంతో చేసుకోవాలనేది మీ ఇష్టం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, పచ్చి మిర్చి, మసాలా దినుసులైన జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యాని ఆకు ఉంటే చాలు.. టమాట పులావ్ ను చేసెయ్యొచ్చు.

తయారు చేయు విధానం

టమాట పులావ్ ను రైస్ కుక్కర్ లో లేదంటే మామూలు గిన్నెలో కూడా వండుకోవచ్చు. ముందుగా ఓ గిన్నె తీసుకోండి. దాన్ని స్టవ్ మీద పెట్టి.. అందులో కొంచెం ఆయిల్ వేయండి. తర్వాత రుచి కోసం కొంచెం డాల్డా వేసుకోండి. డాల్డా కాగాక.. అందులో సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివెపాకు, పైన చెప్పుకున్న మసాలా దినుసులన్నీ వేసి బాగా కలపండి.

ఒకవేళ మీకు డాల్డా నచ్చకపోతే.. డాల్డా బదులు నెయ్యి వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి దోరగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత టమాట ముక్కలు వేయండి. దోరగా వేగాక.. ముందే నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి… దానికి సరిపడా నీళ్లు పోయండి. అంతే నీళ్లన్నీ ఇంకిపోయి బియ్యం ఉడికితే చాలు.. టమాట పులావ్ రెడీ అయినట్టే. తర్వాత దాని మీద కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గార్నిష్ చేసుకొని తినేయడమే.

కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. పన్నీర్ కూడా వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్లు. డ్రై ఫ్రూట్స్ వేసుకునే వాళ్లు ఆయిల్ వేసినప్పుడే ఆయిల్ లో వేసి దోరగా వేయించుకుంటే బాగుంటుంది. పన్నీర్ వేసుకోవానుకున్న వాళ్లు పన్నీరును చిన్నచిన్న ముక్కలుగా కోసి ఆయిల్ లో ఉల్లిగడ్డు, పచ్చి మిర్చి వేసిన తర్వాత వేసి వేయించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news