Bigg Boss 5 Telugu: ప్రొమో అదిరింది.. ఒక్కొక్కరికి గ‌ట్టిగానే … అరుసుకున్న కింగ్ నాగ్

-

Bigg Boss 5 Telugu: ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఈరోజు ప్రోమో విడుదల అయింది. వికెండ్ షో కావ‌డంతో కింగ్ నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రోమో చూస్తే.. ఈ రోజు ఒక్కొక్క కంటెస్టెంట్ కు నిలుచున్న చోట‌నే చుక్క‌లు చూపించాడు. చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఈ వారం కొత్త‌గా కింగ్ నాగార్జున ఫోటో క్రషర్ తీసుకొచ్చాడు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ఫోటో వేస్తూ.. క‌డిగేస్తున్నాడు.

నాగార్జున కండ్ల‌ల్లో శివ సినిమా ఇంటెసిటీ క‌నిపిస్తుంది. ఒక్కొక్కరిని నిల్చోబెట్టి.. వారి తప్పులను ఎత్తిచూపి.. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ మాట్లాడుతూ స‌రైన ఫీడ్ బ్యాక్ ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. త‌ప్పులు చేసిన‌వారి దుమ్ము రేపారు కింగ్ మామా. సింపుల్ గా చెప్పాలంటే.. ప్ర‌తి వారం లా రాడ్ ఎపిసోడ్ ప్లాన్ చేయ‌కుండా అందరికీ రాడ్లు దింపే ఎపిసోడ్ ఫ్లాన్ చేసారు బిగ్ బాస్ టీం.

ఈ వారం నాగార్జున ప‌ర్ పెక్ట్ రిజ‌న్స్ చెప్పుతూ.. కంటెస్టెంట్ల‌కు బ్యాండ్ బాజా బారాత్ మోగించాలని కనపడుతున్నాడు. ప్రోమో ప్ర‌కారం.. గివ్ అప్ ఇచ్చినందుకు ఆనీ మాస్ట‌ర్ కు, తొండి ఆట ఆడినా కాజ‌ల్ కు, సంచాలక్ నిర్ణ‌యంపై అసంతృప్తితో ర‌గిలిపోతున్న మాన‌స్ కు, అలాగే జెస్సీ చేతిలో బ్యాగ్ ను త‌న్నినందుకు స‌న్నీకి నాగార్జున ఫీడ్ బ్యాక్ ఏ రేంజ్ లో ఇచ్చారు.

మిగిత వాళ్ల‌ను కూడా గ‌ట్టిగానే అరుసుకున్న‌ట్టు టాక్. మ‌రీ నాగ‌ర్జున ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను ఎవ‌రూ గ‌ట్టిగా తీసుకుంటారు? ఎవ‌రూ లూస్ గా విడిచిపెడుతారో ముందుముందు ఎపిసోడ్ ల్లో వేచి చూడాలి. అలాగే.. కింగ్ నాగ్ కూడా.. ఇదే రేంజ్లో హోస్టింగ్ చేస్తే.. షో ఓ రేంజ్ లో దూసుక‌పోతుంది. మ‌రింత రేటింగ్ సంపాదించుకుంటుందని బిగ్ బాస్ ల‌వ‌ర్స్ అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news