Big Boss Non Stop: బిగ్ బాస్ క్వీన్ బిందు మాధవి..టైటిల్ విన్నర్ ఆమెనే!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ ప్రజెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఊహించని ట్విస్టులు తెర మీదకు ఇచ్చేందుకు ‘బిగ్ బాస్ ’ రెడీ అయిపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ సైతం గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య ఫైట్ బూతుల పర్వం దాకా వెళ్లింది. ఇక కంటెస్టెంట్స్ అందరూ ఒకరిని మరొకరు నమ్మే పరిస్థితులు అయితే కనబడటం లేదు.

రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ ఓటీటీ గేమ్ లో కంటెస్టెంట్ బిందు మాధవి మాత్రం ఓటింగ్ లో సత్తా చాటుతున్నది. గత వారంతో పోల్చితే ఈ వారం ఆమెకు ఓటింగ్ శాతం కొంత మేర తగ్గింది. కానీ, ఆమెను సపోర్ట్ చేసేవారు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆరో వారం ‘బిగ్ బాస్’ షో కొనసా..గుతున్నది.

ఇంకో మూడు లేదా నాలుగు వారాల పాటు బిందు మాధవి పర్ఫార్మెన్స్ ఇలానే కొనసాగితే కనుక డెఫినెట్ గా బిందు మాధవినే ‘బిగ్ బాస్ ఓటీటీ’ షో టైటిల్ విన్నర్ అవుతుందని పలువురు గెస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్కులు కాని ఫన్ గేమ్స్ కాని అంత బెటర్ గా బిందు మాధవి పర్ఫార్మ్ చేయలేదు. కానీ, ఆమెకే ఓటింగ్ పర్సంటేజీ ఎక్కువగా వస్తోంది. అలానే మున్ముందు కూడా కొన సాగితే బిందు మాధవి టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని బీ బీ లవర్స్ తో పాటు కొందరు పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version