ఏపీ సీఎం జగన్ పై బయోపిక్.. ప్రధాన పాత్రలో స్కామ్ హీరో..

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం మీద యాత్ర పేరుతో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన పాదయాత్రను ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో మహి వి రాఘవ్ కి దర్శకుడిగా మంచి ప్రశంసలు దక్కాయి. చాలా మంది నిర్మాతలు మహి వి రాఘవ్ తో సినిమా తీసేందుకు ముందుకు వచ్చారు. ఐతే మహి వి రాఘవ్ ఆల్రెడీ మరో సినిమా కమిట్ అయ్యాడు.

ఈ సారి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితం మీద సినిమా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇందులో ప్రధాన పాత్రలో ప్రతీక్ గాంధీ నటిస్తున్నారని అంటున్నారు. స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో మెప్పించిన ప్రతీక్ గాందీ, జగన్ పాత్రను పోషించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, మహి చెప్పిన స్క్రిప్టు, ప్రతీక్ ని బాగా ఆకర్షించిందట. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకి వెళ్ళనుందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.