Bipasha Basu : బేబీ బంప్ తో బిపాసా బసు..ఫోటోలు వైరల్

-

మహేష్ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో మహేష్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది బిపాసా బసు. అయితే ఆ తరువాత ఈమె ఏ తెలుగు సినిమాలో ఎక్కడా కూడా నటించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో రాజ్ జిస్మ్, ధూమ్-2, రేస్ వంటి చిత్రాలలో నటించింది.

అయితే ఈమె కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమయింది.అయితే ఇటీవల తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బస్సు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలు పంచుకుంది ఈ బ్యూటీ. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news