నటసామ్రాట్ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన బాలకృష్ణ తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. అంతేకాదు తన తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో కూడా బాలకృష్ణ నటించిన మెప్పించారు ఇక తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలను రీమేక్ చేసి మళ్లీ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఇకపోతే కొన్ని వేల కోట్లకు ఆస్తి పరుడైన తన తండ్రి తన ఎనిమిది మంది కొడుకులకి సమానంగా ఆస్తిని పంపిణీ చేయడం గమనార్హం. ఇక సినిమాల ద్వారా ఎంత సంపాదించారు అనే విషయం ఇప్పుడు ఒకసారి చిదివి తెలుసుకుందాం.నందమూరి బాలకృష్ణ కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు పోషిస్తూ బుల్లితెరపై హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందారు. ఇక ఈయన రాజకీయాలలో కూడా హిందూపురం తరఫున ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. ఇక మొదటగా బాలకృష్ణ తన సినిమాల ద్వారా ఎంత పారితోషికం తీసుకుంటారనే విషయానికి వస్తే ఒక్కో సినిమాకు రూ.ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకునే వారు . కానీ అఖండ సినిమా విజయం కావడంతో ఆయన రూ.10కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
బాలకృష్ణ దగ్గరున్న కార్ల కలెక్షన్ విషయానికి వస్తే బెంట్లీ కారును ఇటీవల కొనుగోలు చేసినట్లు సమాచారం. బీఎండబ్ల్యూ లేటెస్ట్ కార్ ను కూడా సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ఆడి Q5 కార్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక తనకి ఇష్టమైన టాటా సఫారీ ని కూడా కొనుగోలు చేశారు బాలకృష్ణ. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే దీనినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే ల్యాండ్ రోవర్ , రేంజ్ రోవర్ కార్ లు కూడా బాలకృష్ణ సొంతం. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఇదే కాకుండా జూబ్లిహిల్స్లో మరో రూ. 30 కోట్లు పెట్టి డూప్లెక్స్ హౌస్ ను కొనుగోలు చేశారు.
ఇక మొత్తం ఆస్తి రూ.325.47 కోట్లు ఉంటున్నట్లు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక బంగారం, వెండి , ప్లాటినం వంటి విలువైన ఆభరణాలు కూడా వీరి దగ్గర ఉన్నట్లు సమాచారం. ఇక మొత్తంగా చూసుకుంటే సుమారుగా రూ.1000 కోట్ల వరకు ఇలా ఆస్తి ఉంటుందని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.