ప్రస్తుత తరంలో డయాబెటిస్ ( Diabeties ) కామన్ గా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన విధానాలు మొదలగు వాటివల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాలిక ఇబ్బంది నుండి తట్టుకోవడానికి కాకరకాయ సాయపడుతుందని చెబుతుంటారు. అదీగాక డయాబెటిస్ రాకుండా నివారించవచ్చని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజంగా డయాబెటిస్ పై కాకరకాయ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం.
సాధారణంగా ఏదైనా చేదు పదార్థాన్ని రుచి చూసినపుడు అది శరీరంలోని అన్ని భాగాలకు ఒకరమైన కదలిక ఇస్తుంది. శరీరంలో ఫైటోకెమికల్ కారణంగా రుచి చూసిన ప్రతీసారి ప్రతిస్పందన తెలియజేసే హార్మోన్లని విడుదల చేస్తుంది. ఇది శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
డాక్టర్ జెఫ్రీబ్లాండ్ ప్రకారం డయాబెటిస్ కి సూచించే మందులు కూడా చేదు రుచి విధానాలను అనుకరించేలా ఉంటాయి. కాబట్టి చేదు కారణంగా డయాబెటిస్ నియంత్రణలో ఉండవచ్చని భావన. దీనికోసం కొన్ని ప్రత్యేక ఆహారాలు ఉపయోగించవచ్చు. అందులో కాకరకాయ ఒకటి. దీన్ని రసం చేసుకుని సేవించడం మంచిది.
కాకరకాయ రసం ఎలా తయారు చేసుకోవాలంటే
దీనికి కావాల్సిన పదార్థాల
కాకరకాయ- పొట్టు తీయనిది
2ఉసిరి- తరిగినవి
అల్లం- అంగుళం
నీళ్ళు- 150మిల్లీ లీటర్లు
నిమ్మకాయ- ఒకటి
హిమాలయ ఉప్పు- చిటికెడు
వీటన్నింటినీ కలిపి మిశ్రమాన్ని తయారు చేసి వడపోయాలి.
దీన్ని కొద్ది కొద్దిగా తాగాలి. సిప్ లాగా తాగడం చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా తాగాలి. మీకు కావాలంటే డైరెక్టు కాకరకాయ రసాన్ని చేసుకోవచ్చు. కానీ దాన్ని తాగలేరు. కాబట్టి ఇతర పదార్థాలతో సర్దుబాటు చేసినదాన్ని హాయిగా ఆరగించవచ్చు.