నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షాపై మండిపడ్డారు. అయితే.. తాజాగా.. బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రోజురోజుకు బలహీనపడి ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి.
అది తట్టుకోలేక రేవంత్ రెడ్డి..షా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. రేవంత్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. దిగజారి వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు.. దాసోజు శ్రవణ్ కుమార్ సైతం బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా 10 నుంచి 20 మంది ముఖ్య నేతలు ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని ఈటల రాజేందర్ వెల్లడించారు.