దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి రావొద్దు: విద్యాసాగర్‌రావు

-

హైదరాబాద్: దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై బీజేపీ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి 46 ఏళ్లు అయిందన్నారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి రావొద్దన్నారు. అంతర్గత కలహాలు వచ్చే పరిస్థితిలేదని చెప్పారు. మోదీ ఉండగా అత్యవసర పరిస్థితి రాదన్నారు. అత్యవసర పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదని చెప్పారు. అంతర్గత కలహాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూసే శక్తి ఏ దేశానికి లేదని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్వార్థ రాజకీయాలు చేశారని ఆయన గుర్తు చేశారు.

 

కాగా 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు. 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version