కేసీఆర్ కుటుంబంలో మొదటి వికెట్ : విజయశాంతి

-

బీజేపీ మహిళ నేత విజయశాంతి కేసీఆర్ కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మొదటి వికెట్ కేసిఆర్ కూతురు కవిత నుండే ప్రారంభమైందని.. తర్వాత కొడుకు, అల్లుడే ఉన్నారని అన్నారు విజయశాంతి. హైదరాబాద్ వనస్థలిపురంలో మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె..మహిళకు మెతక వైఖరి పనికిరాదని..దృఢంగా ఉండాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేదని విజయశాంతి వెల్లడించారు. ఫార్మ్ హౌస్ లో ఉంటూ సీఎం కేసీఆర్ 4లక్షల రూపాయల తీసుకుంటాడు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడని మండిపడ్డారు. అధికార పార్టీ మహిళ సర్పంచ్ పట్ల అసభ్యంగా మాట్లాడిన ఓ ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ డాన్ అని వఅన్నారు విజయశాంతి. కవితను ఈడీ, సీబీఐ లు పిలుస్తే వెళ్లరు, తప్పు చేసి మహిళ అని తప్పించుకుందాం అనుకుంటున్నారని విమర్శించారు.

BJP Leader Vijayashanthi Fires On CM KCR Haliya Meeting - Sakshi

కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులే అని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కు ఈ రాష్ట్రం అడ్డాగా తయారు అయిందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కూడా మహిళలను వదలకుండా వేధిస్తున్నారు. ఏనాడైనా సీఎం కేసీఆర్ మహిళలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చేశాడా అని విజయశాంతి అడిగారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ ఇదే విధంగా చలనం లేకుండా ఉంటున్నాడని అన్నారు. అవసరానికి పని చేయించుకొని అవతలికి పొమ్మంటడు కేసీఆర్.. మహిళలు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛను ఇచ్చే విధంగా సీఎం విధానాలు లేవని అన్నారు ఆమె. కల్వకుంట్ల తండ్రీకొడుకులు మాట్లాడితే చిన్న పిల్లలు టీవీలు చూసే పరిస్థితి లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news