పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకా కేటీఆర్ : షర్మిల విమర్శలు

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో నాగమడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం పిట్లంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకా కేటీఆర్… తెలంగాణను రోకలిబండతో కొట్టి చంపింది ఎవరు? అంటూ అడిగారు షర్మిల. 33 ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించినందుకు తెలంగాణను వైఎస్సార్ రోకలిబండతో కొట్టినట్టా? అని ప్రశ్నించారు. “రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? ఆరోగ్య శ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ… ఇవన్నీ కూడా ప్రజలను కొట్టి చంపినట్టేనా? నిజానికి తెలంగాణను రోకలిబండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య ‘కసాయి రావే’. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? అంటూ కేటీఆర్ పై షర్మిల విరుచుకు పడ్డారు.

- Advertisement -

Ys sharmila Fire on KCR:YSRTP Party Chief Sharmila Fire Telangana On Cm KCR  | Ys sharmila Fire on KCR:బంగారు తెలంగాణ అంటే ఇదే నాNews in Telugu

ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడు పట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయి రావే కదా! అని అన్నారు.
ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే… తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు కాజేసింది మీరే. మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లి లాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయటపెట్టి చూడు… నీకు, నీ అయ్యకు ఆ రోకలిబండే సమాధానం” అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...