అమ్నీషియా పబ్ అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ.. రేప్ ఘటన నిందుతులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మీడియా ముందు పెట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.. అయితే ఆ ఫోటోలో, వీడియోల్లో మైనర్లు ఉన్నారంటూ.. అలా మీడియా ముందు చూపడం కరెక్ట్ కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘు నందన్ మాట్లాడుతూ.. నేను అమ్మాయి పేరు చెప్పలేదు, ముఖం చూపించలేదని, ఎంఐఎం నాయకులను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఫోటోలు విడుదల చేయక ముందే అన్ని టీవీలల్లో విజువల్ వచ్చాయని, ఇది అసలు దోషులను తప్పించాలని చేస్తున్న దుర్మార్గమైన కుట్ర అంటూ ఆయన మండిపడ్డారు. కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదని, జోయల్ డేవిస్‌కు నా గురుంచి తెలుసు… నా తప్పుంటే కేసు పెట్టండి మాజీ మంత్రులు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది… మానసిక ఆనందం పొందుతున్నారు. ఎమ్మెల్యే కొడుకును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మండిపడ్డారు. మీ ఉడత ఊపులకు భయపడను అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.