మహహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మ వివాదంలో చిక్కుకున్నారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ లో మాట్లాడుతూ… మహహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్‌. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఆ వీడియోను విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న… ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశాయి.

BJP MLA Raja Singh bereavedబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలోని చంద్రయాణాగుట్ట పోలీస్ ముందు ఈ రోజు ఉదయం ఎంఐఎం చంద్రయాణాగుట్ట కార్పొరేటర్లు స్టేషన్లో ఫిర్యాదులు చేసి, స్టేషన్ ముందు ఎదుటే నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం శ్రేణులు, పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎంఐఎం నాయకులు డిమాండ్ చేసారు. దీంతో పాత బస్తీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news