భారతీయ జనతా పార్టీ మరో వివాదానికి తెర లేపింది. చాయ్ ని జాతీయ పానీయంగా ప్రకటించాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. చాయ్ ని జాతీయ పానీయంగా ప్రకటించాలంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ పవిత్ర మార్గరేటా పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రాన్ని కోరారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు ప్రతి ఇంటి కిచెన్ లో చాయ్ లభిస్తుందని ఆయన వెల్లడించారు. దేశ ప్రజలు ఉదయం చాయ్ తోనే తమద్దిన చర్యను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. చాయ్ లేనిది ఏ ఒక్క మనిషి ఉండలేరని, అందుకే చాయ్ ని జాతీయ పానీయంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ పవిత్ర మార్గరేటా డిమాండ్ చేశారు.