తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాని బీజేపీ చూస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. తాజాగా ఈనెల 28న తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల నేతలతో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఓ రకమైన ఎన్నికలక వాతావరణం తీసుకురానున్నారు. ఇటీవల అమిత్ షాతో సమావేశమైన తెలంగాణ బీజేపీ నేతలు.. అమిత్ షా ప్లాన్ ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎస్సీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రుల పర్యటలను కూడా ఉంటాయని బీజేపీ చెబుతోంది.
రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నేతలు, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఇప్పటి వరకు ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. దీంతో ఆయా స్థానాల్లో బలోపేతం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు టార్గెట్ గానే 28 రోజున జరిగే సమావేశాలను చూడాల్సి ఉంది.