తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది.
హిరణ్యకశిపుడిని అంతం చేసేందుకు లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యారని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నరసింహ జయంతిని జరుపుకుంటున్నామని బీజేపీ తెలిపింది. నరసింహ జయంతి అంటే చెడుపై మంచి సాధించిన విజయం అని కూడా తెలిపిన బీజేపీ.. అలా సరిగ్గా నరసింహ జయంతి నాడే తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్నారని, తెలంగాణలో కొనసాగుతున్న చెడును అంతం చేసేందుకే ఈ పర్యటన సాగుతోందన్న అర్థం వచ్చేలా బీజేపీ సదరు ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అయితే ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Sri Lakshmi Narasimha Swamy appeared to kill the demon Hiranyakashipu. #NarasimhaJayanti signifies the victory of good over evil.
Not a coincidence, but a fierce avatar of Vishnu, a Slayer of evil in #Telangana. https://t.co/iC8O1nGGVP
— BJP Telangana (@BJP4Telangana) May 14, 2022