సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాల. సెప్టెంబర్ 25న మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో జరిగే సమ్మాన్ దివస్ కు సీతారాం ఏచూరిని ఆహ్వానించారు ఓం ప్రకాశ్ చౌతాల. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ..బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్నారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవడం మంచి పరిణామం అన్నారు.
దేశాన్ని, ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రజల బ్రతుకు దెరువును కాపాడాలంటే బిజెపిని అధికారం నుంచి దించాలన్నారు. కేసీఆర్ తో రాష్ట్ర స్థాయిలో పని చేసిన తరువాత దాని ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం వస్తుందన్నారు. మునుగోడులో బిజెపిని ఓడించేది టిఆర్ఎస్ ఒకటేనని..అందుకే టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్,వామపక్షాలు వారి వారి పోరాటాలు కొనసాగిస్తున్నాయన్నారు. 2024 ఎన్నికల్లో బిజీపి ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్చగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బిజెపికి 400 సీట్లు కాదు.. ఓటమి తథ్యమన్నారు.