హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. హర్యానాలో బీజేపీ మూడోసారి విజయం సాధించడంతో నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. తొలుత కాంగ్రెస్ లో లీడ్ లో కొనసాగింది. లీడ్ లో కొనసాగిన కొద్ది సేపటికే బీజేపీ ముందంజలోకి వచ్చింది. హర్యానాలో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 37, INLD 2, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
బీజేపీ విజయంతో ఢిల్లీలో సంబురాలు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో హర్యానాలో ఘన విజయం సాధించామని.. జమ్మూ కాశ్మీర్ లో ఓట్లు సాధించినట్టు తెలిపారు జే.పీ.నడ్డా. హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని.. అందుకే హ్యాట్రిక్ విజయం సాధించినట్టు తెలిపారు.