జమ్మూ కాశ్మీర్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

-

జమ్మూ కాశ్మీర్ లో తొలుత నుంచి బీజేపీ విజయం సాధిస్తుందని భావించినప్పటికీ సత్తా చాట లేకపోయింది. దాదాపు పదేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్-సీపీఎం కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. బీజేపీ 29 స్థానాలు, పీడీపీ 3, జేపీసీ 1, ఆప్ 1 స్థానాలను దక్కించుకున్నాయి.

మొత్తం 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను కూటమి పార్టీలు చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. అలాగే విజయం సాధించిన కూటమికి అభఇనందనలు తెలిపారు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ పని తీరుపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ పని తీరుపై గర్వపడుతున్నట్టు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news