గొర్రెలలో మూతి వాపు వ్యాధి నివారణ చర్యలు..

-

గొర్రెలు, మేకల పెంపకం ఆదాయాన్ని పెంచుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఇదే పనిలో వున్నారు.జీవాల పోషణ అనేది వ్యయం తక్కువైనప్పటికి ఓర్పుతో యాజమాన్య పద్దతులు అనుసరించాల్సిన అవసరం ఉంది.. కలుషితమైన నీరు తాగటం వల్ల ఈగలు, దోమలు ఎక్కువై అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో జీవాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా జీవాల్లో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి నీలి నాలుక, మూతి వాపు వ్యాధి. ఇది అతి సూక్ష్మ జీవుల వల్ల వస్తుంది.ఇది భయంకరమైన వ్యాధి..

ఈ వ్యాధి దోమలద్వారా అతివేగంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి రోగలక్షణాలు కనిపించకుండానే వ్యాప్తి చెందుతుంది. జీవాల శరీర ఉష్ణోగ్రత 104 నుండి 107 డిగ్రీలవరకు ఉంటుంది. చిగుళ్లు, పెదవులు వాచి పెదవుల చివర ఎరుపు రంగుకు చేరుకుని కొన్ని సార్లు రక్తం కూడా కారుతుంది. చెక్కిళ్ల లోపలి భాగంలో తవుడు కణాల వంటి చిన్నచిన్న పగుళ్లు ఏర్పడతాయి. దీంతో నాలుక వాచి నీలి రంగుకు మారుతుంది. నోటి నుండి సొంగ కారుతుంది. మేత సరిగా మేయలేవు. జీవాల కాలి గిట్టల మొదటి భాగంలో వాపు వచ్చి కుంటుతూ నడుస్తాయి. మేత తినకపోవటం వల్ల నీరసించి పోతాయి. వ్యాధి నివారణకు రక్షా బ్లూ టీకాలు వేయించాలి..లేకుంటే మాత్రం అన్నిటికీ ఈ వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధికి నివారణ చర్యలు..

దోమల బెడదను తగ్గించాలనుకొనేవారు వాటిని ఉంచే బయట మాలాథియాన్ వంటి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. షెడ్డు పొడిగా ఉండాలి. గొర్రెలను తేమ లేని ఎత్తైన ప్రదేశాలలో ఉంచాలి. రాత్రి సమయంలో షెడ్డులోపల పొగవేయాలి. ఏడాదిలో కనీసం మూడు సార్లు విధిగా నట్టల మందులు తాగించి జీవాలు, ఆరోగ్యంగా ధృఢంగా ఉండి రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేసి నోటిని పొటాషియం పర్మాంగనేట్ లోషను తో కడిగి , బోరోగ్లజరిన్ పూయాలి.ఇక ఈ వ్యాధి నుంచి బయట పడటానికి రాగుల జావలో గ్లూకోజ్ పొడి , కొంచెం ఉప్పు కలిపి జాగ్రత్తగా తాగించాలి. అంతేకాదు పశు వైద్యులను సంప్రదించి తగిన మందులను తప్పక వాడాలి..

Read more RELATED
Recommended to you

Latest news