అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఇవాళ ఘనంగా ముగిసాయి. ఒక కిలోమీటర్ డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్ లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, జంగారెడ్డి గూడెం జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవల పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. గత మూడు రోజులుగా గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ జరిగాయి. 11 జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు, 12 జట్లు పోటీ పడ్డాయి.
ఈ సంక్రాంతికి ఆత్రేయపురం వద్ద భారీ స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించారు. కేరళను తలపించే విధంగా ఆత్రేయపురం వద్ద పడవల పోటీలు నిర్వహించారు. మరోవైపు విశాఖ మత్స్యకార గ్రామాల్లో సంక్రాంతి జోష్ నెలకొంది. వరాహ నదిలో జిల్లా స్థాయి పుట్టుల పోటీలు నిర్వహించారు. రాయవరం (మం) బంగారమ్మ పాలెంలో 40 మందికి పైగా మత్య్స కారులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.