సీఎం రేవంత్ రెడ్డి చొరవతో దుబాయి నుంచి ఇండియాకు తెలంగాణ వాసుల మృతదేహాలు రానున్నాయి. ఇటీవల వక్ఫ్ చట్ట సవరణ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన స్వర్గం శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ మృతి చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సీఎస్ లేఖలు రాశారు. ఇక మృతుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శవ పేటికల రవాణాకు ఉచిత అంబులెన్స్ లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ మేరకు దుబాయి నుంచి ఇండియాకు తెలంగాణ వాసుల మృతదేహాలు తీసుకురానుంది.