చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

-

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్​ శెండే కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శెండే మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శెండే మరణవార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్​ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

“సునీల్​ శెండే(70).. అదివారం అర్ధరాత్రి విలేపార్లేలోని తన నివాసంలో మరణించారు. హిందూ శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు” అని సినీ విమర్శకులు పవన్​ ఝా మీడియాకు తెలిపారు.

30 సంవత్సరాల సినీ కెరీర్​లో సునీల్​ శెండే.. అనేక చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో మెరిశారు. గాంధీ, ఖల్​ నాయక్​, ఘాయల్​, జిద్ది, దౌద్​, మగన్​, విరుద్ధ్​ వంటి చిత్రాల్లో నటించారు. ఆమిర్​ ఖాన్ నటించిన సర్ఫరోష్​ మూవీలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పాత్రను ఆయన పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news