మరో సౌత్ రీమేక్..బాలీవుడ్ స్టార్ హీరో అఫీషియల్ అనౌన్స్‌మెంట్

-

దక్షిణాది చిత్ర సీమ ఖ్యాతి రోజురోజుకూ పెరుగుతున్నదని చెప్పొచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ ఫిల్మ్స్‌ను దక్షిణాది చిత్ర సీమలో రీమేక్ చేసేవారు. కానీ, ఇప్పుడు ట్రెండు మారింది. సౌత్ లాంగ్వేజెస్ సూపర్ హిట్ మూవీస్ ను బాలీవుడ్ రీమేక్ చేస్తోంది.

ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సౌత్ రీమేక్స్ బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి కూడా. ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్ హిందీలో రీమేక్ చేయగా, అది బ్లాక్ బాస్టర్ అయింది. ‘జెర్సీ’ కూడా రీమేక్ అయి విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, మరో సౌత్ మూవీని రీమేక్ చేయబోతున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రకటించారు.

ట్వి్ట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. కోలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఖైదీ’ని హిందీలో ‘భోళా’గా రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ ఫిల్మ్ ను లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేశారు.

హిందీలో ధర్మేంద్ర శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, టబు హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కనుంది. ఈ చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 30 న పిక్చర్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ‘ఖైదీ’ లోకేశ్ కనకరాజ్ తొలి చిత్రం కాగా, ఇందులో హీరోగా కార్తీ నటించారు. అజయ్ దేవగణ్ RRR చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

2019లో ఈ సినిమా విడుదలైంది. లోకేశ్ తన రెండో ఫిల్మ్ ఇళయ తలపతి విజయ్ తో చేశారు. ‘మాస్టర్’ పిక్చర్ కూడా సూపర్ సక్సెస్ అయింది. ప్రజెంట్ లోక నాయకుడు కమల్ హాసన్ తో ‘విక్రమ్’ ఫిల్మ్ చేస్తున్నారు లోకేశ్ కనకరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news