ఒకేలాగా కనిపించే హీరోయిన్స్… వీరిని చూశారా?

-

పోస్టర్ చూసినప్పుడో లేదంటే సినిమాల్లో సీన్ చూసినప్పుడో సేమ్ పలానా హీరోలా హీరోయిన్​లా ఉన్నారే అనిపిస్తుంది ప్రతిఒక్కరూ కనీసం ఒక్క సారైనా ఇలా భ్రమపడి ఉంటారు అలాంటి హీరోయిన్లు ఒక్కరిద్దరు కాదు పది మంది ఉన్నారిక్కడ వారెవరో ఓ లుక్కేయండి.

స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె అమలాపాల్ ప్రింట్ అన్నట్టుగానే ఉంటారు వీరిద్దరి ఫీచర్స్ చాలా క్లోజ్​గా ఉంటాయి. స్టార్ హీరోయిన్ సమంత తమిళ్ బ్యూటీ ఆత్మిక సేమ్ ఫీచర్స్ ఆడియన్స్​ను కన్ఫ్యూజ్ చేస్తాయి.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో అలరించి వర్ష బొల్లమ్మ లేటెస్ట్​గా అంటేసుందరానికి వంటి చిత్రాల్లో మెరిసిన నజ్రియా నజీమ్ ట్విన్స్ మాదిరిగానే కనిపిస్తారు.

హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్ సీరియల్ నటి సుజిత చూడ్డానికి సిస్టర్స్ లాగానే కనిపిస్తారు. బాలీవుడ్ హీరోయిన్ ఇషాగుప్తా హాలీవుడ్ ఏంజిల్ ఏంజెలినా జోలి పిక్స్ చూపించి వీరిద్దరూ సిస్టర్స్ అంటే చాలా మంది నమ్మేస్తారు కూడా.

బ్యూటీకి బ్రాండ్ అంబాసిడర్​గా ఐశ్వర్యరాయ్​ను చూపిస్తారు అయితే సేమ్ ఐశ్వర్య పోలికలతోనే కనిపిస్తుంది కరెంట్ మూవీ తార స్నేహా ఉల్లాల్.

స్టార్ బ్యూటీ త్రిష ఈరోజుల్లో వంటి సినిమాలో నటించిన రేష్మకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి అకస్మాత్తుగా చూస్తే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. దివంగత నటి సౌందర్య ఫేస్ కట్​ కలిగి ఉన్నారు హీరోయిన్ నిత్యామేనన్.

దివంగత బ్యూటీ దివ్యభారతి నిన్నటి తరం హీరోయిన్ రంభ సేమ్ టూ సేమ్ అన్నట్టుగా ఉంటారు. బంగారుబుల్లోడు సినిమాలో నరేష్​తో ఆడిపాడిన పూజా జవేరి బిగ్​బాస్ బ్యూటీ భానుశ్రీ కూడా ట్విన్స్​ లాగే కనిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news