సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్‌, టెన్షన్‌..!

-

కేరళ రాజధాని తిరువనంతపురంలోని అధికార పార్టీ సిపిఐఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్ పై బాంబు దాడి జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురువారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి సిపిఎం ప్రధాన కార్యాలయం గేటు పై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాలో చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

రాత్రి 11:30 సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. దీంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని సిపిఎం ఆరోపిస్తోంది. కాగా దీనిపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. ఘటనపై ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కేరళలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version