భార్యకు అలా చెప్పడం క్రూరత్వం కాదు : బాంబే హైకోర్టు

-

ఇంటి పనులు చేయాలని వివాహితకు అత్తింటివారు చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పనిమనిషిలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఓ మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. “ఒక వివాహితను ఇంటి పని చేయమని చెప్పారంటే..అది కచ్చితంగా కుటుంబ అవసరానికై ఉంటుంది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతేపెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు మరోసారి అలోచించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి” అని వ్యాఖ్యానించింది. తాజా కేసులో మహిళ.. తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news