ఆ పేషెంట్స్ కి ఏపీ సర్కార్ శుభవార్త.. ఆ చికిత్స కూడా ఇక ఆరోగ్యశ్రీ కింద !

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీలో బోన్ మ్యారో చికిత్సని చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని ఎంపానల్ద్ ఆసుపత్రుల్లోనూ ఈ వ్యాధి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చిన 887 చికిత్సా విధానాలు కూడా మరో ఆరు జిల్లాలకి వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా 7 జిల్లాల్లో అమలవుతున్న చికిత్సలు మిగిలిన 6 జిల్లాలకు వర్తింప చేయనున్నారు. ఇప్పటికే ఉన్న 2200 చికిత్సలకు ఆదనంగా మరో 233 చికిత్సలు కూడ ఆరోగ్యశ్రీ లో చేర్చింది ప్రభుత్వం. పధకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ అయ్యాయి.