జూమ్ ప్రేమ చూపిస్తున్నారు జగన్ ఫైర్

మైనార్టీలపై ట్విట్టర్‍, జూమ్‍ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. నంద్యాల ఘటన బాధాకరం, నా దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు.

నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాం అని ఆయన వివరించారు. మంచి చేయాలని మేం ఆలోచిస్తుంటే ఎలా బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారు అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారు అని, న్యాయస్థానంలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైంది అని ఆయన పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం అని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాం అని అన్నారు.