కేంద్ర మంత్రి విమర్శలు నిజమైతే….వాళ్ళు ఇచ్చిన అవార్డులు అబద్దమా ?

-

విశాఖ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడిన భాష జుగుప్సగా అనిపించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హుదూద్ తుఫాన్ తర్వాత భూముల రికార్డులు తారుమారవ్వడం వాస్తవం కాదా….!? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు దోపిడీ దారుడన్న అయన జీవీఎంసీ బిల్డింగ్ తాకట్టు పెట్టి నిధులు తీసుకు వచ్చిన ఘనకార్యం చంద్రబాబుదని అన్నారు. విశాఖ,అమరావతి, హైదరాబాద్ అన్నీ నా గుండెల్లో ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు….ఆయన గుండె ఏమైనా చెరువా… ? అని ప్రశ్నించారు.

ఆస్తి పన్నులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు….15శాతం మించి పెంచకుండా చట్టం చేశాముని అన్నారు. దేశంలో టాప్ 100 మున్సిపాలిటీల్లో 40 ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని, బెస్ట్ స్టేట్ అవార్డు ఇచ్చిన కేంద్ర మంత్రి ఎన్నికల కోసం విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్ర మంత్రి విమర్శలు నిజమైతే….వాళ్ళు ఇచ్చిన అవార్డులు అబద్దమా ? అని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజాలు పడ్డాయి…. స్ట్రాటజిక్ సెల్ ను ఎలా అడ్డుకోవాలో మా ఎంపీలకు, మాకు అవగాహన వుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news