75 శాతం అటెండెన్స్ ఉంటేనే అమ్మ ఒడి ఇస్తాం -మంత్రి బొత్స

-

ఇంటర్మీడియట్ లో తగ్గలేదు.. పదో తరగతిలో తగ్గింది… ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని.. అమ్మ ఒడి అన్నది 75 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు ఇస్తున్నామని షాక్‌ ఇచ్చారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించి స్కూళ్లకి పంపించండి.. విద్యార్థి బడి మాన కూడదన్నదే అమ్మ ఒడి ఉద్దేశమే అన్నారు.

రెండు వేల్లు కోత అన్నది ఒకటి మెంటినెన్స్ కోసం వెయ్యి రూపాయలు, మరో వెయ్యి రూపాయలు వాచ్ మెన్, అలాగే పలు అవసరాలకు వినియోగిస్తానని తెలిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇంటింటికీ కొలాయల అన్న కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది…ఇంకో అయిదు ఇలాంటి భారీ ట్యాంకులు జిల్లాలో ఏర్పాటుచేశామని వెల్లడించారు.

ఏడువేల ఆరు వందల కేఎల్ నీటిని స్టోర్ చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించాం…గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుని నీళ్లు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. బీపీఎల్ కాని వాళ్లైతే అరువేలు కడితే నీటి కొలాయి అందిస్తామని.. నిరంతరాయంగా మా ఎమ్మెల్యే తో పాటు మా ప్రతినిధులు వార్డులలో పర్యటిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news