బీసీలకు న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కడే : మంత్రి బొత్స

వైసీపీ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. అయితే.. ఈ సభను ఇందిరాగాంధీ మున్సిపల్
స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కాగా ఈ సభకు జరుగుతున్న ఏర్పాట్లను ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరి జయరాం తదితరులు పరిశీలించారు. అయితే.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కడేనని వెల్లడించారు. బీసీలు ఇవాళ మార్కెట్ కమిటీ పదవుల నుంచి రాజ్యసభ పదవులకు వరకు పొందారంటే అందుకు కారణం జగన్ అని స్పష్టం చేశారు మంత్రి బొత్స. ఇకపైనా బీసీలకు మరింత మేలు చేయడం గురించే జగన్ ఆలోచిస్తున్నారని వివరించారు.

Botsa Satyanarayana slams at AP BJP, says it is striving for existence in  the state

ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మ ఒడి పథకాలతో బీసీల జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని బొత్స పేర్కొన్నారు. మరి, చంద్రబాబు బీసీలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఇచ్చినంతనే బీసీ సంక్షేమం అయిపోతుందా? అని అన్నారు. “మంత్రులుగా మాకు అధికారం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు మా బలహీన వర్గాలను అవమానించడమే” అని పేర్కొన్నారు మంత్రి బొత్స.