అమరావతి ఉద్యమం రైతులది కాదు.. టిడిపి కార్యకర్తలది : బొత్స సంచలన వ్యాఖ్యలు

-

అమరావతి ఉద్య‌మం రైతుల‌ది కాదని.. టిడిపి కార్య‌క‌ర్త‌లదని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ. రాజ‌కీయ ల‌బ్ది కోసం రైతుల‌ను అడ్డు పెట్టుకోవ‌ద్దని మండిపడ్డారు మంత్రి బొత్స. గంజాయి గురించి మాట్లాడే హ‌క్కు చంద్రబాబుకు లేదు. పోలీసు వ్య‌వ‌స్థ‌పై నింద‌లు వేయ‌డం స‌రికాదని ఫైర్ అయ్యారు. చెర‌కు రైతుల‌కు బ‌కాయిలు పూర్తిగా చెల్లిస్తామనీ… ఎన్‌సిఎస్ సుగ‌ర్స్‌కు చెందిన 24 ఎక‌రాల‌ను వేలం వేసి, ఆ సొమ్ముతో బ‌కాయిలు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామనీ ప్రకటించారు.

ఎన్‌సిఎస్ సుగ‌ర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్ర‌యోగిస్తాం. ఫ్యాక్ట‌రీ భూములను విక్ర‌యించి, రైతుల బ‌కాయిల‌ను వీలైనంత త్వ‌ర‌గా చెల్లిస్తామన్నారు మంత్రి బొత్స. రూ.10కోట్లు విలువైన పంచ‌దార‌ను ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సీజ్ చేసిందన్నారు. మాది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం. రైతు సంక్షేమ‌మే మాకు ముఖ్యమనీ.. ప్ర‌తిప‌క్షాలు చేసే త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్దని పేర్కొన్నారు.

2015 నుంచి పేరుకుపోయిన రూ.27.80 కోట్ల‌ను, ఫ్యాక్ట‌రీ భూముల‌ను అమ్మి, త‌మ ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. ప్ర‌స్తుతం  రూ.16కోట్ల బ‌కాయి ఉంది. అణాపైసాతో స‌హా చెల్లించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంటుందని వెల్లడించారు మంత్రి బొత్స. స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న తెలిపే హ‌క్కు, ధ‌ర్నా చేసే హ‌క్కు అంద‌రికీ ఉంటుందని.. కానీ పోలీసుల‌పై రాళ్లేసే సంస్కృతి స‌రికాదని చురకలు అంటించారు మంత్రి బొత్స.

Read more RELATED
Recommended to you

Exit mobile version